చిరు చిత్రం ప్రారంభ వీడియో

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్‎బి చౌదరి, ఎన్‎వి ప్రసాద్ నిర్మించనున్న మెగాస్టార్ 153వ చిత్రం బుధవారం ఉదయం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.