చార్యకు ఘనస్వాగతం

తూర్పుగోదావరి జిల్లా : ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు రాజమండ్రికి వెళ్లిన మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధురపుడి ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగగా, అభిమానులు పూల వర్షం కురిపించారు. ఇక మెగాస్టార్ రోడ్డు మార్గాన ర్యాలీగా వెళ్తే అభిమానులకు అభివాదం చేస్తూ అభిమానులపై తన ప్రేమను చూపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ సినిమాలకు మారేడుమిల్లి షూటింగ్ స్పాట్ గా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో అల్లు అర్జున్ పుష్ప అక్కడే షూటింగ్ జరగగా, ఇప్పుడు ఆచార్య కోసం చిరు, రామ్ చరణ్ మారేడుపల్లి ప్రాంతానికి రావడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇందులో మెగాస్టార్ నక్సలైట్ గా కనిపించనున్నాడని టాక్. కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో విద్యార్ధి నాయకుడి పాత్రలో మెరవనున్నాడు. మే 13న విడుదలకానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు హైదరాబాద్ శివారులో వేసిన టెంపుల్ సెట్లో మూవీ చిత్రీకరణ జరుగగా, ఇప్పుడు మారేడుమిల్లి ఏజెన్సీతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.