విద్యా సంస్థల అధినేత ఆత్మహత్య

చిత్తూరు జిల్లా: పీలేరు ఎంజెఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట్రమణా రెడ్డి అలియాస్ బాబురెడ్డి రైలు కింద పడి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎంజేఆర్ విద్యా సంస్థ అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి విద్యా సంస్థలకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో నిలిచి పోయాయి. కరోనా కారణంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు కాలేదు. దీంతో విద్యా సంస్థల నిర్వహణకు తెచ్చిన అప్పులు కట్టలేక అవమాన భారంతో ఆత్మహత్యకు దారి తీసినట్లు పీలేరు లో చర్చించు కుంటున్నారు. వేల మంది విద్యార్థులను విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఎంజేఆర్ విద్యా సంస్థల అధినేత వెంకట్రమణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని కలచివేస్తోంది. అయితే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.