ఆ సినిమా సాంగ్స్​కు మంచి రెస్పాన్స్​

హైదరాబాద్​ : “హుషారు” ఫేమ్ అభినవ్ మేడిశెట్టి హీరోగా రమ్య పసుపులేటి హీరోయిన్ గా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నందన్ దర్శకత్వంలో రాజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్”. రామ్ కామ్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీత సారథ్యం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘గగనం దాటే’ తొలి పాటను జీ సరిగమ ఫేమ్ యశస్వి ఆలపించగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ పాట వన్ మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని రెండో మిలియన్స్ కి రీచ్ అవుతోంది.

తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్న సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘తెలియదే.. తెలియదే’ రెండవ పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేయగా అది వన్ మిలియన్ కు చేరుకుంటుంది. ఇలా ప్రతి పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ కంపల్సరీగా బాగుండాలి. అప్పుడే సినిమా 50% సక్సెస్ అవుతుందని ఇండస్ట్రీలో నానుడి. అలా సంగీతంతో మ్యూజికల్ హిట్స్ అయిన సినిమాలు కోకొల్లలు. అలాంటి సందర్భానుసరంగా వచ్చే పాటలు మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలో ఉన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మ్యూజిక్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రవిమణి అద్భుతమైన విజువల్స్ తో ప్రతి ఫ్రేమ్ ని అందంగా తీర్చి దిద్దాడు. ఆడియెన్స్ కి విజువల్ ఫీస్ట్ లా ఈ చిత్రాన్ని దర్శకుడు నందన్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మైల్స్ ఆఫ్ లవ్ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్ గా తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

ఈ చిత్రానికి కెమెరా : రవిమణి కే నాయుడు, సంగీతం : ఆర్ఆర్ ధ్రువన్, ఎడిటర్ : బీ నాగిరెడ్డి, రచన-దర్శకత్వం : నందన్, నిర్మాత: రాజిరెడ్డి.