డివిజన్ల ఇంచార్జిలకు మంత్రి ఎర్రబెల్లి దిశానిర్దేశం

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో డివిజన్ల ఇన్ చార్జీలుగా ప‌ని చేస్తున్న పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు, స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నక్కలగుట్టలోని హోట‌ల్ హరిత‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయాల్సిన తీరు తెన్నులు, ఏయే అంశాల‌ను ప్ర‌స్తావించాలి. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన సంద‌ర్భాలు, స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యుల‌ను ఎక్క‌డెక్క‌డ వినియోగించుకోవాలి? ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఏ విధంగా వివ‌రించాలి? వ‌ంటి అనేక అంశాల‌ను మంత్రి వివ‌రించారు. ఎక్క‌డ ఎలాంటి లోపాలు లేకుండా ఈ కొద్ది రోజులు క‌ష్ట ప‌డాల‌ని త‌ద్వారా గ్రేట‌ర్ పై గులాబీ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు.

ads

ఈ స‌మావేశంలో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్, ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్, ఎంపీలు బండ ప్ర‌కాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, పార్టీ ఇన్చార్జీ గ్యాద‌రి బాల‌మ‌ల్లు, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, రాజేశ్వ‌ర‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, తాటికొండ రాజ‌య్య‌, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మాధ‌వ‌రం కృష్ణారావు, ఒడితెల సతీశ్‌కుమార్, శంక‌ర్ నాయ‌క్, కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు వాసుదేవ రెడ్డి, నాగూర్ల వెంక‌న్న, మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.