క్రికెట్​ ఆడిన మంత్రి

వరంగల్​ అర్బన్​ జిల్లా : నిత్యం ప్రజలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలతో బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణంలో భాగంగా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో కొద్దిసేపు ఆగారు.

అదే సమయంలో ఆ పక్కన ఉన్న గ్రౌండ్ లో కొందరు కుర్రాళులు క్రికెట్ ఆడుతున్నారు. కొద్దిసేపు ఆ పిల్లలతో కలిసి మంత్రి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టి బంతులని ఎదుర్కొన్నారు. హఠాత్తుగా తమ మధ్య కు ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి తమతోనే క్రికెట్ ఆడటం వాళ్లని ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి తమతో కలిసి పోవడం ఆ పిల్లల్ని ఎంతో ఆనందపరిచింది.