మహబూబ్నగర్ జిల్లా: ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్నగర్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. నారాయణ గౌడ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విషాదం పై శ్రీనివాస్ గౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Home News