క్యాడర్​కు పార్టీ భరోసా

హైదరాబాద్ :​ పార్టీని నమ్ముకున్న క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేదే టీఆర్​ఎస్​ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతో ముందు చూపుతో దేశంలోనే మొదటి సారిగా రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్​ పార్టీ సభ్యత్వానికి బీమా పాలసీ అమలులోకి తెచ్చారని ఆయన వెల్లడించారు. ఈ బీమా పాలసీ ఇప్పుడు క్యాడర్ కు లీడర్ కు భరోసాగా మారిందని మంత్రి జగదీశ్​రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ టీఆర్ ఎస్ కార్యకర్త రమావత్ హరి 2019 డిసెంబర్ 8 న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటికే మృతుడు హరి టీఆర్ ఎస్ సభ్యత్వం కలిగి ఉన్నాడు. దీంతో సదరు కార్యకర్త దివంగత రమావత్ హరి సతీమణి మొతి పేరుతో రెండు లక్షల చెక్కు మంజూరైంది. సంబంధిత చెక్కును ఆదివారం మంత్రి జగదీష్ రెడ్డి అంద జేశారు.

‘ప్రమాదవశాత్తు జరిగే ఈ తరహా సంఘటనలతో ఆయా కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకే టీ ఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈ తరహా బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారని’మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.