నేడు విజయవాడకు కేంద్ర మంత్రి

అమరావతి: కేంద్ర బడ్జెట్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేడు విజయవాడకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. పట్టణంలోని వెన్యూ కన్వెన్షన్ హాల్​లో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు, ఇతర ముఖ్యులతో నిర్వహించే అవగాహనా సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ ఛాంబర్స్​కు చెందిన ప్రతినిధులతోనూ మంత్రి జైశంకర్ సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి ఢిల్లీ కి వెళ్లనున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.