సింగరేణి కార్మికుల మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ 6 వ బొగ్గు గనిలో 2 వ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా బండ కూలి ఇద్దరు సింగరేణి కార్మికుల మృతి చెందారు. ఈ ఘటన పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తగు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు మంత్రి సూచించారు.

ads