వెయిట్​లిఫ్టర్లకు అభినందనలు

హైదరాబాద్​: వెయిట్​ లిఫ్టింగ్​కు ఎంపికైనా రాష్ట్రానికి చెందిన ఐదుగురు వర్ధమాన క్రీడాకారులను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అభినందించారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో వెయిట్​ లిఫ్టింగ్​ క్రీడాకారుల గుర్తింపు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, క్రీడాకారులు సాయి వర్దన్, శేష సాయి, భరత్ కుమార్, సహస్ర, స్వరాజ్ చౌహన్ లు పాల్గొన్నారు.