సీఎం కేసీఆర్ కు మంత్రి తలసాని ఆహ్వానం

హైదరాబాద్ : భాగ్యనగరంలో బోనాల సీజన్ నడుస్తోంది. గత కొన్ని వారాలుగా బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు హాజరుకావాలంటూ సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరపున సీఎంకు ఆహ్వాన పత్రిక అందచేశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఉన్నారు.

ads