మల్లన్న సన్నిధిలో తలసాని

సిద్ధిపేట జిల్లా : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధి కి సీఎం కేసీఆర్​ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. సోమవారం మంత్రి తలసాని కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

‘మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దాసారం గుట్టపై భక్తులకోసం వసతి గృహాల నిర్మాణం చేపడమతామని చెప్పారు. దేవాదాయ శాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండ్ నిర్మిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. కొండపోచమ్మ ఆలయ అభివృద్ధి కి సీఎం రూ. 10 కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు. ఆలయ విస్తరణ, భక్తులకు సౌకర్యాల కల్పనకు నిధులు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఈరోజు మంత్రి హరీష్ రావు, తాను అధికారుల మావేశంలో నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి స్పష్టంచేశారు.