ఢిల్లీ నగరంలో పేలుడు

ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడులో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం వద్ద భారీగా భద్రతను పెంచారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.