‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్

హైదరాబాద్​ : రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ పతాకంపై శైలేష్ సన్ని, జ్ఞానేశ్వరి కండ్రేగుల జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం “మిస్టర్ అండ్​ మిస్” రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ ను మధుర శ్రీధర్ చేతుల మీదుగా విడుదల చేయించారు.

‘నాకు ఇష్టమైన దర్శకుల్లో అశోక్ ఒకరు. చాలా కష్టపడతాడు. “ఓ స్త్రీ రేపు రా” అనే సినిమా తీశాడు. తను హిందీలో కూడా ఆ కాన్సెప్ట్​ను తీసుకోవడం జరిగింది. ఎప్పుడూ తను కొత్త కాన్సెప్ట్ తో వస్తుంటాడు. అలా వచ్చిన కొత్త కాన్సెప్టే ఈ “మిస్టర్ అండ్ మిస్”. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయమని ఎన్నిసార్లు చెప్పినా అశోక్ వినలేదు. ఈ సినిమాను డైరెక్ట్ గా సినిమా థియేటర్ లోనే విడుదల చేయాలనే పట్టుదలతో.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన “ఆర్ ఎక్స్100” సినిమా లా ఈ మూవీ అనిపిస్తుంది. అశోక్ మనస్సుని అర్థం చేసుకొని యూనిట్ అందరూ బ్రిలియంట్ వర్క్ చేశారు . యశ్వంత్ నాగ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ నెల 29న థియేటర్లో విడుదల చేస్తున్న ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు మధుర శ్రీధర్​.

“మిస్టర్ అండ్ మిస్” బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక జంట సెల్ఫీ రొమాంటిక్ వీడియోను ఇష్టపడి తీసుకుంటే ఆ వీడియో వారి చేతులు దాటి మూడవ వ్యక్తికి చేరితే ఎలా ఉంటుంది . వాళ్లు హై లో
ఉన్నప్పుడు తీసుకున్న ఈ వీడియో సొసైటీ కి చేరినపుడు వారి పేరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతారు, వాళ్ల రిలేటివ్స్ ఎలా ఫీలవుతారు, వీళ్లు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ కథ. దీనికి ఒక మంచి లవ్ స్టోరీ జతచేసి తీయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను ఫస్ట్ రిలీజ్ చేశాము. దానికి అనుకున్న వ్యూస్ రాలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలు అన్నీ బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోవలోకే చెందిందని చాలామంది అన్నారు. అందువల్ల రెండవ ట్రైలర్ లో ఒక్క లిప్ కిస్ కూడా లేకుండా ఈ ట్రైలర్ ను విడుదల చేశాము. ఈ సినిమాకు దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు ఇన్వెస్ట్ చేసి తీసిన క్రవుడ్ ఫండెడ్ మూవీ. నా మీద, నా స్టోరీ మీద ఇంత నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఓన్లీ యూత్ తో పాటు పేరెంట్స్ కూడా చూడదగ్గ సినిమా. మీరందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెల 29న విడుదల అవుతున్నా మా సినిమాను మీరందరూ తప్పక చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు అశోక్​.

హీరో, హీరోయిన్.. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు : పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం
మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పీఆర్వో : జీఎస్​కే మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.