పేదలకు వరం సీఎంఆర్​ఎఫ్​

వరంగల్​ రూరల్ జిల్లా : నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేట నియోజకవర్గంలోని నిరుపేదలైన 115 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి మంజూరైన రూ. 39 లక్షల 80 వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

‘ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక వ్యాధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు (లేదా) ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న పేదవారు సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ఎమ్మెల్యే పెద్ది సూచించారు.

పార్టీలకతీతంగా, పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎందరో ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పేదవారికి అందే సంక్షేమ పథకాలు మాత్రం ఎక్క డా ఆగకుండా సీఎం కేసీఆర్ కృషి చేశారని పెద్ది గుర్తుచేశారు.

దిగువ దారిద్ర్య రేఖకు (బీపీఎల్​ ) కింద ఉన్న ఎన్నో కుటుంబాలు నేడు ఎగువ దారిద్ర్య రేఖకు (ఏపీఎల్​) పైన ఉండడం హర్షించ దగ్గ విషయం’ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఎంపీపీ , వైస్ ఎంపీపీ , జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు