మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలి

హైదరాబాద్ : ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్‎ని జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసారు. నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లాలో కలెక్టర్ భవనము మరియు పరిపాలక భవనాలను ఏర్పాటు చేసి తగు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు.

గోదావరి నది పరివాహక ప్రాంతంలో కరకట్టను మంజూరు చేస్తే ఏటూరునాగారం మరియు మంగ పేట మండల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సీతక్క సీఎస్ కు వివరించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పరిధిలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని, మల్లంపల్లి మండలంగా ప్రకటిస్తే ములుగు జిల్లా పరిధిలో కేంద్రబిందువుగా ఉంటుందని తెలిపారు. అలాగే నర్సంపేట నియోజకవర్గం మరియు వరంగల్ నియోజకవర్గాలకు కూడా దగ్గరగా ఉంటుంది అని వినతి పత్రాలను అంద చేశారు.