హరిభూషణ్ కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క

ములుగు జిల్లా : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి , కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న హరిభూషణ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఏమ్మెల్యే సీతక్క పరామర్శించారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతిపై సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కన్నీళ్లపర్యంతమయ్యారు. ములుగు నియోజకవర్గంలోని గంగారం మండలం మడగూడెం గ్రామంలో హరిభూషణ్ కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి, హరిభూషణ్ కు సంతాపం తెల్పారు.

ads

తను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి హరిభూషణ్ అని, తనతో పాటు గతంలో దండకారణ్యంలో పనిచేసినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని సీతక్క గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతకైనా సిద్ధపడే వ్యక్తి అయినప్పటికీ , హరిబూషణ్ చాలా మృదుస్వభావి అని ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం చేసిన పోరాటాల్లో ఎన్నోసార్లు చావు అంచుల వెళ్లి వచ్చాడని, అలాంటి వ్యక్తిని కరోనా బలితీసుకోవడం బాధాకరమని సీతక్క కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హరిభూషణ్ కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో సీతక్కతో పాటు గంగారం, కొత్తగూడ మండలఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, విజయ రూపుసింగ్, జడ్పీటీసీలు ఈసం రామ సురేష్ , పుష్పలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర పోతయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు , వజ్జా సారయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మోగిలి, కోఆప్షన్ సయ్యద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజాం సారంగం, బిసి సెల్ నాయకులు వేలుదండి వేణు తదితరులు పాల్గొన్నారు.