ఈనెల 21 లోగా దరఖాస్తులు

వరంగల్ అర్బన్ జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికలలో 80 యేండ్ల పైబడినవారు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్‎కు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి, ఓటింగ్ వేయలేని 80 సంవత్సరాల పైబడిన, దివ్యాంగులు, కోవిడ్-19 అనుమానిత బాధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఈనెల 21 లోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. దివ్యాంగులు సదరన్ క్యాంపు సర్టిఫికెట్‎ను జత చేయాలని చెప్పారు. జిల్లా వైద్యాధికారి గుర్తించిన కోవిడ్ అనుమానిత బాధిత ఓటర్లకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారం- 12 (D)ని అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.