మొక్కలు నాటిన ఎమ్మెల్సీ

గద్వాల జిల్లా : వనపర్తి లోని కొత్తకోటలో గల పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. గద్వాల జిల్లాలోని శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత మార్గమధ్యంలో కొత్తకోటలో ఆగారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణ ప్రకృతి వనంలో మొక్కలు నాటారు‌. ఎమ్మెల్సీ కవితకు టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.