ఎమ్మెల్సీ వాణీదేవి వాహనానికి ప్రమాదం

ads

హైదరాబాద్ : అసెంబ్లీ లో ఎమ్మెల్సీ వాణీ దేవి వాహనానికి ప్రమాదం జరిగింది. సమయానికి వాణీదేవి డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో డ్రైవర్ కు బదులు గన్ మెన్ వాహనాన్ని నడిపాడు. అయితే అసెంబ్లీలోనికి వస్తుండగా, వాహనం గేటుకు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. గేటు మొత్తం ధ్వంసం అయ్యింది. అయితే ప్రమాద సమయంలో వాహనంలో వాణీదేవీ లేకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.