ఎమ్మెల్సీల సమావేశం

హైదరాబాద్​: ఎమ్మెల్సీలు ఆదివారం హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ల విజ్ఞప్తులు, సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధులు, విధులకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,సీఎం కేసీఆర్​కు త్వరలో వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత దృష్టి తీసుకువచ్చారు. అనంతరం కవితకు పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్, దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సతీష్ కుమార్, తేరా చిన్నప రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శంబీపూర్ రాజు, బాలసాని లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ఎడిట్​