7న విద్యార్థులతో ప్రధాని ‘పరీక్షా పే చర్చా’

న్యూఢిల్లీ : విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ సోమవారం వెల్లడించారు. ‘విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, టీచర్లతో సబ్జెక్టులపై లోతైన చర్చ, పలు ఆసక్తికర ప్రశ్నలు-జవాబులు ఉంటాయి. ఏప్రిల్ 7న రాత్రి 7గంటలకు చూడండి’ అని మోడీ ట్వీట్ చేశాడు. కొవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు.

ads