ముస్లిం ఓట్లను దీదీ కోల్పోయిందన్న మోడీ

కూచ్ బెహర్ : బెంగాల్ లో ముస్లిం మద్దతు ఓటర్లను దీదీ కోల్పోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేడు కూచ్ బెహర్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ముస్లిం ఓటర్లు ఐక్యంగా ఉండాలని, ఓట్లను డివైడ్ చేయవద్దు అంటే ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావించిన ప్రధాని మోడీ, అంటే దీదీ ముస్లింల మద్దతు కోల్పోతుందని అర్థమవుతోందన్నారు. ముస్లింల ఓటు బ్యాంకును కోల్పోవడం వల్లే దీదీ అలా అభ్యర్థన చేసిందన్నారు. అభివృద్ధి రూపంలో బెంగాలీ ప్రజలకు తన ప్రేమను చూపిస్తానన్నారు.

ads

బెంగాల్ జనాభాలో 27 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. టీఎంసీ విజయంలో ముస్లిం ఓట్లే కీలకంగా మారనున్నాయి. అయితే ఆ ఓట్ల కోసం ఇప్పుడు కొత్తగా ఎంఐఎం పోటీ పడుతున్నది. దీదీ…మీరు ఎన్నికల సంఘం పట్ల అనుచితంగా మాట్లాడుతున్నారని, ఒకవేళ మేం హిందువులంతా ఏకమై , బీజేపీకి ఓట్లు వేయాలని కోరితే, మాకు ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి పది నోటీసులు వచ్చేవని , యావత్ దేశమంతా మాపై ఎడిటోరియల్స్ రాసేవని మోడీ అన్నారు.