మొక్కలు నాటిన బిగ్​బాస్​ ఫేమ్​

హైదరాబాద్ :​ దేత్తడి హారిక విసిరిన గ్రీన్​ చాలెంజ్​ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో
ప్రముఖ హీరోయిన్ , బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ మొక్కలు నాటారు.

‘జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటాను. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపీ సంతోష్ కుమార్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్’అని అన్నారు ప్రముఖ హీరోయిన్​ మోనాల్​ గజ్జర్​ .అనంతరం మరో నలుగురు (మాకప ఆనంద్, మిత్ర గాద్వి, క్రిష్ణ కుల్ శేకరన్, మల్హాత్ థాకర్) లు గ్రీన్ ఇండియా చాలెంజ్‌ విసిరారు.