ఎలుక మూతి, ఒళ్లంతా చారలు

సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల జిల్లాలో ఓ అరుదైన చేప మత్య్సకారుడికి చిక్కింది. మౌత్ క్యాట్ ఫిష్‌గా పిలిచే ఈ చేపను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. నల్లటి చర్మంపై జీబ్రా మాదిరి గీతలతో,ఎలుక మూతి ఆకారంలో విభిన్నంగా ఉన్న ఈ చేప సిరిసిల్లలోని ఎస్సారార్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌లో దొరికింది. స్థానిక మత్స్యకారుడు వంగళ నరేష్ శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లగా అతని వలలో ఈ చేప పడింది.

ఈ చేప పేరు సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌ అంటారు. విదేశాలలో మాత్రమే కనిపించే ఈ అరుదైన జలపుష్పాన్ని కొద్దిరోజుల క్రితమే మనదేశంలోని కొన్ని నదులలో గుర్తించారు. తాజాగా ఇది గోదావరి నదిలోకి చేరింది. ఈ చేప వార్త తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు దాన్ని చూసేందుకు తండోపతండాలుగా చేరుకున్నారు. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు.