ముక్కోటి వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జులై 24న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని ఒకే గంటలో 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో ముక్కోటి వృక్షార్చన పోస్టర్ ను , కరపత్రాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు.

ads

జూలై 24న నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకగా కాకుండా, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగకరమైన ఒక గ్రీన్ డే గా జరపాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్ణయించారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈనెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరూ పాల్గొని మూడు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొనెపూడి రమేష్ బాబు , టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుందర్ రాజ్ యాదవ్ , పొడిశెట్టి అనిల్, తాళ్ళపల్లి జనార్థన్, లక్ష్మణ్‌,ప్రకాష్, రోహిత్ సింగ్‌, వేణు మాధవ్, వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.