ఉత్కంఠపోరులో చెన్నైపై ముంబై విక్టరీ

ads

ఢిల్లీ : ఐపీఎల్ 14వ సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై 4 వికెట్లతో గెలుపొందింది. 219 పరుగుల ఛేదనలో ఆల్ రౌండర్ పొలార్డ్ ( 87 నాటౌట్ : 34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు ) విధ్వంసం సృష్టించడంతో ముంబై 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

క్వింటాన్ డికాక్ (38), రోహిత్ శర్మ (35), క్రునాల్ పాండ్య (32) రాణించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లు తీయగా శార్దుల్ ఠాకూర్, జడేజా, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు డుప్లెసిస్ ( 50 : 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు ), మొయిన్ అలీ ( 58 : 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ), అంబటి రాయుడు ( 72 నాటౌట్ : 27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు.

ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాట్స్ మెన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది.