టీఆర్​ఎస్​కు మద్దతుగా నిలపాలి

మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఏకం చేసి టీఆర్ఎస్​కు మద్దతుగా నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కోరారు. శనివారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ – హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్​ఎస్​ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణి దేవి లకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బ్రాహ్మణ సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది.

ads

సీఎం కేసీఆర్​ బ్రాహ్మణులను గౌరవిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అందుకే మీ కోసం చరిత్రలో మిగిలేంతగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులు, వారి నాయకులు ఏనాడూ రాజకీయాలు చేయలేదన్నారు. అదే బీజేపీ నాయకులు దేవుళ్లని , ప్రజల భక్తి సెంటిమెంట్లను రాజకీయం చేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. నిజానికి వాజిపేయి లాంటి నేతలు ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోలేదన్నారు. మోడీ ప్రభుత్వం, బీజేపీ తెలంగాణ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఏకం చేయాలన్నారు. తాను కూడా మీకు అండగా ఉంటానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. యాదాద్రి లాంటి అభివృద్ధిని మనం ఊహించామా? వాస్తవాలు విశ్లేషించండి. విచక్షణతో ఓట్లు వేయాలని కోరారు. బ్రాహ్మణులు తమ సంఘాల తరపున మద్దతు తెలిపినందుకు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి. ఓట్లు, సీట్లకు అతీతంగా మనకు సేవ చేస్తున్న మహానుభావుడని ఎమ్మెల్సీ పురాణం సతీష్​ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించడం ద్వారా కేసీఆర్​ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సోదరులకు భీమా, సామూహిక ఉపనయన అవకాశాలు కల్పించాలి. ఈ డిమాండ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు చెప్పి సాధించుకుందామని ఎమ్మెల్సీ సతీష్​ చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి, రాష్ట్ర అర్చక సమాఖ్య లు టీఆర్​ఎస్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆ సమితి, సమాఖ్యనేతలు, స్థానిక నేతలు గంగు ఉపేంద్ర శర్మ, కాకిరాల హరిప్రసాద్, రామచంద్రయ్య శర్మ, తదితరులు పాల్గొన్నారు.