కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలి

ఉత్తరాఖండ్ : ఫిబ్రవరి 27, నుంచి ఏప్రిల్ 30 వరకు హరిద్వార్ లో జరుగుతున్న కుంభ మేళా సందర్భంగా వచ్చే భక్తులు మరియు యాత్రికులు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నివారణకు భక్తులు, యాత్రికులు ఎస్​వోపీ మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి వ్యాప్తి పెరగకుండా పాటించాల్సిన నిబంధనలపై భక్తులు , యాత్రికులకు అవగాహన కల్పించాలని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాసిన లేఖలో కోరారు.

ads

ఈ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు మరియు 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు దర్శనానికి రావద్దన్నారు. అలాగే మధుమేహం, రక్తపోటు, గుండె, పల్మనరీ మరియు మూత్రపిండాల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు, క్యాన్సర్ , గర్భిణులు కుంభమేళా కు రావద్దని సూచించారు.

భక్తులు, యాత్రికులు పాటించాల్సిన నిబంధనలు :

– సందర్శకులు,యాత్రికులు కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించడానికి నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

– కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే సమయంలో కొవిడ్ -19 టెస్ట్ రిపోర్ట్ (72 గంటల లోపల తీసుకున్నది) నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం నెగెటివ్​ ఆర్టీ పీసీఆర్​ తప్పనిసరిగా సమర్పించాలి.

– కుంభమేళా ను సందర్శించే ముందు ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసి ఉపయోగించుకోవాలి. తిరిగి వచ్చిన తరువాత కూడా సందర్శకులు సంబంధిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న కొవిడ్ పరీక్షలు లేదా క్రియాశీల పర్యవేక్షణకు లోబడి ఉండవచ్చని తెలిపారు.