‘నారప్ప’ విడుదల తేదీ ఫిక్స్​

విక్ట‌రీ వెంక‌టేష్ `నార‌ప్ప‌` షూటింగ్ పూర్తి , మే14న వ‌రల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌హైదరాబాద్​ : సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి వీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుంచి ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌ , పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది.
విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ జ‌న‌వ‌రి 31తో పూర్తికానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కే నాయుడు
సంగీతం : మణిశర్మ
ఎడిటర్‌ : మార్తాండ్ కే వెంకటేష్‌
ఆర్ట్‌ : గాంధీ నడికుడికర్‌
కథ : వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్ : సత్యానంద్
ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌ : జీ రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : రామబాలాజి డీ
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : ఏపీ పాల్‌ పండి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : విజయ్‌ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూస ర్‌ : దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు : డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల