నంద కిషోర్ హీరోగా సక్సెస్​ అవ్వాలి

విక్టరీ వెంకటేష్​ చేతుల మీదుగా “నరసింహపురం” టీజర్​ విడుదల​హైదరాబాద్​ : గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పీఆర్​ క్రియేషన్స్ సమర్పణలో టీ ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తున్నారు. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్​ను అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంతో హీరోగా మారుతున్న నంద కిషోర్ హీరోగానూ మంచి పేరు తెచ్చుకోవాలని వెంకటేష్​ అభిలషించారు. ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, దర్శకులు శ్రీరాజ్ బళ్లా, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, కెమెరామెన్ కర్ణ ప్యారసాని పాల్గొన్నారు.

ads

తమ చిత్రం ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. వెంకటేష్​కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవింద సమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో ధీరజ్-అప్పాజీ, మేకప్ : కేవీ బాబు, పబ్లిసిటీ డిజైన్స్ : వెంకట్. ఎం, వీఎఫ్​ఎక్స్ : చందు ఆది, కెమెరా : కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డీఐ శివ వై .ప్రసాద్, 5.1 మిక్సింగ్ : రమేష్ కామరాజు, పాటలు : గడ్డం వీరు, సంగీతం : ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు : శ్రీరాజ్ బళ్లా – టీ ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీరాజ్ బళ్లా.