ఐఏఎస్ అలుగు వర్షిణిపై NCSC సీరియస్

ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై NCSC సీరియస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. ఎస్సీ గురుకుల విద్యార్థు పట్ల చేసిన వ్యాఖ్యాలకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి జాతీయ కమిషన్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదెలా ఉంటే ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఇటీవల చేసిన కామెంట్లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్ధులు క్లాస్ రూంలు క్లీన్ చేసుకోవడం, టాయిలెట్లు కడగటం చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. గురుకుల పిల్లలు బాగా ఉన్నత కుటుంబాల నుంచి రాలేదని, ఎవరొచ్చి చేస్తారని అన్నారు. వాళ్ల టేబుల్ మీదకు భోజనం రాదు, రోటీలు చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిణి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు సైతం సీరియస్ అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.