“వైష్ణవ జనుడవు నీవే అయితే”

జాతిపిత మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణహైదరాబాద్​: మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా “వైష్ణవ జనుడవు నీవే అయితే” ఓ ప్రార్థనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. ఈ గీతాన్ని తెలుగులో రాసి విడుదల చేశారు శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కే ఎమ్ రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్రమందించారు.

ads

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలా రామన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ, బ్రిగేడియర్ వీ శ్రీనివాసరావు, దైవజ్ఞశర్మ, తెలంగాణ సీడ్స్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఎండీ కేశవులు, ఆలిండియా డైరెక్టర్ ఉదయ్ శంకర్ అతిధులుగా పాల్గొన్నారు. కమలా రామన్ కృషిని ప్రశంసించారు.
సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్, గాయని ఉష, శ్రీవెంకట్ ట్రస్ట్ ప్రతినిధులు సూర్య కమల, ప్రేమ్ చంద్, శివ దండపాణి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు!