మారుతి లాంచ్​ చేసిన ఆ ట్రైలర్​ తెలుసా?

హైదరాబాద్​ : ఐకా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా “నేడే విడుదల”. ఈ సినిమాను కొత్త దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టిన విషయం మనకు తెలిసిందే. కాగా ఈ సినిమా ట్రైలర్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి లాంచ్ చేశాడు.

‘ఇప్పుడే నేడే విడుదల అనే సినిమా ట్రైలర్ చూశాను. నేనే లాంచ్ చేయడం కూడా జరిగింది. మన రామ్ రెడ్డి పన్నాల డైరెక్ట్ చేయగా అసిఫ్ ఖాన్ అండ్ మౌర్యాని లు నటించారు. ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కెమెరా వర్క్ అండ్ ఆర్ ఆర్ చాలా బాగుంది. సినిమా నేమ్ కూడా “నేడే విడుదల” అని మంచి క్రియేటివ్ గా పెట్టారు. ఇండస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్టు పైరసీ మీద కూడా దాంట్లో వర్క్ చేసినట్టుంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’అని అన్నారు డైరెక్టర్​ మారుతి.

‘మా నేడే విడుదల సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన మారుతికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ పైరసీ లో చేస్తున్నప్పటికీ మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి బాగా నచ్చే విధంగా ఉంటుంది. సినిమాను ప్రేమించే ప్రతిఒక్కరూ మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మరియు రెండు సాంగ్స్ కి మంచి పేరొచ్చింది. ఈ ట్రైలర్ ని కూడా మీరు చూసి ఆదరించి మాకు సక్సెస్ ఇస్తారు అని ఆశిస్తున్నాను’అని తెలిపారు చిత్ర డైరెక్టర్​ రామ్​రెడ్డి.

‘మా నేడే విడుదల సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన మారుతికి స్పెషల్ థ్యాంక్స్​, మారుతి సార్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ మాలాంటి కొత్తవారికి చాలా ఇన్సిఫిరేషన్. మా సినిమా చాలా బాగొచ్చింది అండ్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ని మీరంతా చూసి మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. సాధారణ ప్రతి సినీ లవర్ కి నచ్చే ఎంటర్​టైన్మెంట్ మా సినిమాలో ఉంది. ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది’ అని నమ్ముతున్నట్టు హీరో అసిఫ్ ఖాన్ తెలిపారు.

ఈ సినిమాలో మిగిలిన తారాగణంగా కాశి విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టీఎన్ ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్ లు నటించారు.

సంగీతం: అజయ్ అరసాడ, లిరిక్స్ : శ్రీమణి, కెమెరా : సీ హెచ్ మోహన్ చారి, ఎడిటింగ్ : సాయి బాబు తలారి, ఫైట్స్ : అంజి, ఆర్ట్ డైరెక్టర్ : సీ హెచ్ రవి కుమార్, సీజీ : ఆర్ అంకోజీ రావు, నిర్మాతలు : నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్, రచన దర్శకత్వం రామ్ రెడ్డి పన్నాల.