మంచి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి

యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “చేతిలో చెయ్యేసి చెప్పు బావ”హైదరాబాద్​ : మేరీ కృపావతి ప్రభుదాస్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య ఓం ,అరుణ్ రాహుల్, అంజనా శ్రీనివాస్ , రోహిణి ముంజల్, సుమన్ , జయప్రకాష్ రెడ్డి ,పోసాని కృష్ణ మురళి, చలపతి రాజు, కవిత నటీ నటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కే జోషఫ్ నిర్మించిన “చేతిలో చెయ్యేసి చెప్పు బావ”. ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సుమన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

‘ఈ సంవత్సరం లో వచ్చిన చిన్న సినిమాల సక్సెస్ లో ఈ సినిమా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.పెద్ద క్యాస్టింగ్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకుల ఎప్పుడు ఆదరిస్తారని ఈ మూవీ ప్రూవ్ చేసింది. దర్శకుడు ప్రసాద్ వచ్చి నాకు కథ చెప్పినపుడు డిఫ్రెంట్ గా ఉందని ఒప్పుకున్నాను .నాకు దర్శకుడు ప్రసాద్ డ్యాన్సర్ గా,డ్యాన్స్ అసిస్టెంట్ గా,డ్యాన్స్ డైరెక్టర్ గా, ఒక డైరెక్టర్ గా అప్పటినుంచి తెలుసు. ఆయన లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రసాద్ నిర్మాతలకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు. అలా నిర్మాత ఇచ్చిన కథను మార్పులు చేసి ఈ రోజు డైరెక్టర్ గా మంచి సినిమా తీసి సక్సెస్ సాధించాడు. ఇలాగే ప్రసాద్ ముందు ముందు పెద్ద హీరోలతో సినిమాలు తీసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాత జోసెఫ్ తను తీసిన మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఇలాంటి మంచి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. ముందు ముందు మీరే దర్శకులకు మంచి కథలు ఇచ్చి ఎన్నో సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నాను. “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” చిత్రాన్ని ఇంకా పెద్ద విజయం సాధించేలా చేయాలి’అన్నారు నటుడు సుమన్​.

‘ఈ చిత్రానికి డైరెక్షన్ చేయడానికి ముఖ్య కారణం చలపతి రాజుగారు. ఇంత మంచి బ్యానర్ ను నిర్మాతను ,ఫ్యామిలిని కల్పించారు. అలాంటి వారి రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచించి జోషఫ్ ఇచ్చిన కథలో చిన్న మార్పు చేసి ఈ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న దాని కంటే బాగా నటించాడు. తెలుగు ఇండస్ట్రీ లో విలన్ కొరత ఉంది. ఈ సినిమాతో మనకు మంచి విలన్ దొరికాడు. అలాగే నిర్మాత నేను ఏ అరిస్టు కావాలంటే ఆ ఆర్టిస్ట్ ను ఇచ్చారు. ఇలా ఈ సినిమాలో 18 మంది పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. నాకు ఎక్కడ షూటింగ్ కావాలంటే అక్కడ ఖర్చుకు వెనకడకుండా ఏర్పాటు చేశారు. నేను ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు డైరెక్టర్ గా పని చేశాను. నేను చేసిన ప్రొడ్యూసర్ లందరి కంటే జోషఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. ఈ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగుంది. దయచేసి మా సినిమాను ఒక్కసారి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’అన్నారు దర్శకుడు కట్ల రాజేంద్ర ప్రసాద్.

సాంకేతిక నిపుణులు

సమర్పణ : మేరీ కృపావతి ప్రభుదాస్

బ్యానర్ : కొమురం ప్రొడక్షన్స్

సారధ్యం : జాన్ దేవదాస్

టైటిల్ : చేతిలో చెయ్యేసి చెప్పు బావా

ఎడిటింగ్ : వెంకటేశ్వరరావు

సంగీతం : పార్థు

డీవోపీ : వేణు మురళీధర్

పీఆర్వో : మధు వీఆర్

కో-డైరెక్టర్ : జీఎం రాధాకృష్ణ

కో ప్రొడ్యూసర్ : ఎస్తేరు రాణి

కథ , ప్రొడ్యూసర్ : కే జోషఫ్

డైలాగ్స్ స్క్రీన్ ప్లే కొరియోగ్రఫీ డైరెక్షన్ : కట్ల రాజేంద్ర ప్రసాద్

నటీనటులు

ఆదిత్య ఓం, అరుణ్ రాహుల్ ,అంజనా శ్రీనివాస్, రోహిణి ముంజల్, చలపతి రాజు, సుమన్, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, కవిత, అనంత్ ,చిత్రం శీను, సుమన్ శెట్టి ,అప్పారావు, జయవాణి, ఇమ్మార్బల్ ,అరుంధతి తదితరులు.