ఈ యేడాది ఒక్కసారే నీట్ పరీక్ష

న్యూఢిల్లీ : మెడిసిన్ లో ప్రవేశాల కోసం ప్రతీ యేటా జరిగే నీట్ పరీక్షను ఈ యేడాదికి ఒక్కసారే నిర్వహించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రతీ యేడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ) నీట్ పరీక్షను నిర్వహిస్తుంది. అయితే, 2021లో మాత్రం ఎన్ టీఏ ఒక్కసారే నీట్ పరీక్షను నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిషాంక్ పోఖ్రియాల్ వెల్లడించారు. లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

ads

ఒక్కసారే నీట్ పరీక్ష అనే అంశానికి సంబంధించి ఇంకా ఎన్ టీఏకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖను సంప్రదించిన తర్వాతనే కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎన్ టీఏ నీట్ పరీక్ష నిర్వహిస్తుందని మంత్రి తన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.