నెల్లూరులో విషాదం

నెల్లూరు జిల్లా : నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. పడారుపల్లిలో ఓ లాడ్జీలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఒకేతాడుతో ఉరివేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఇద్దరూ చిట్టమూరు మండలం మెట్టు సచివాలయం ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి మృతికి ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టామని పూర్తి తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.