కొత్తగా 117 కొవిడ్-19 కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కొవిడ్-19 యాక్టివ్ పాజిటివ్‎గా నిర్ధారణ అయింది. కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 887466కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 878956 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7152 కు చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 1,30,12,150 శాంపిల్స్ పరీక్షించారు.