మహారాష్ట్రలో కొత్తగా కరోనా కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఆందోళనరేపుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 67,013 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,94,840కు, మొత్తం మరణాల సంఖ్య 62,479కి చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 62,298 మంది కరోనా రోగులు కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 33,30,747కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,99,858 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.

ads