సముద్రంలో వింత చేప

ప్రకాశం జిల్లా: చీరాల వాడరేవు గ్రామాంలో సముద్రంలో నుంచి బయటికి వచ్చిన ఓ వింత చేప అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింత చేపకి మూడు నేత్రాలు ఉండటంతో మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని వాపోయారు. మూడు నేత్రాలు ఉన్న ఈ వింత చేపని ఎన్నడూ కనీవినీ ఎరుగమని, ఇలాంటి వింత చేపలు కూడా సముద్రంలో ఉంటాయా అన్న సంగతి తమకు ఇప్పుడే తెలిసిందని మత్స్యకారులు అన్నారు.