పొట్టి సిరీస్ పట్టేసిన కివీస్

న్యూజిలాండ్ : పొట్టి ఫార్మాట్ లోనూ బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ పట్టేసింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్ ), మిషెల్ (34 నాటౌట్ ) రాణించారు. ఈ దశలో వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 171 గా నిర్ణయించగా, బంగ్లా 7 వికెట్లు కోల్పోయి 142 రన్స్ కు పరిమితమైంది. సౌమ్య సర్కార్ (51) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ads