కొత్తగా 1,914 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,914 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నేడు వెల్లడించింది. కొవిడ్ బారినపడిన వారిలో గడిచిన 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, అదే సమయంలో 285 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని తెల్పింది. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,298కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,298 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,734గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 11,617 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,634 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తంగా 393 మందికి కరోనా సోకింది.

ads