ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు

అమరావతి : రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 6,151 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 58 మంది మరణించారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 7,728 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నిన్న ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.

ads