నిఫ్ట్- 2021 ఆన్సర్ కీ రిలీజ్

ఢిల్లీ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( నిఫ్ట్ ) ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. ఆన్సర్ కీని అధికారిక వెబ్‎సైట్ nift.ac.in.కు లాగినై చూడొచ్చు. నిఫ్ట్ 2021 పరీక్ష ఫిబ్రవరి 14న జరిగిన విషయం తెలిసిందే. ఆన్సర్ కీ పై అభ్యంతరాలను అభ్యర్థులు ఫిబ్రవరి 20న ఉదయం 10 గంటలకు పంపొచ్చు.

ఆన్సర్ కీ డౌన్‎లోడ్ విధానం..
– అధికారిక వెబ్‎సైట్ nift.ac.in.కు లాగిన్ కావాలి
– డౌన్ లోడ్ నిఫ్ట్ ఆన్సర్ కీ అనే ట్యాబ్‎పై క్లిక్ చేయాలి
– రోల్ నంబర్, పుట్టిన తేదీ, ధరఖాస్తు చేసుకున్న ప్రోగ్రాం, ప్రశ్నాపత్రం బుక్‎లెట్ సిరీస్‎ను ఎంటర్ చేయాలి
– జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ) ఆన్సర్ కీ కోసం నిఫ్ట్ 2021 పై డౌన్‎లోడ్ క్లిక్ చేయాలి
– అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఎగ్జామ్ బాడీ నిఫ్ట్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది.