హైదరాబాద్: అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ హీరో, హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు బీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, జీ స్టూడియోస్‌లపై బీవీఎస్ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని. ఐవీ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నారు.
‘నిన్నిలా నిన్నిలా ఓ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్. మంచి కామెడీ, హత్తుకునేలా మంచి ఎమోషన్స్, లవ్ అన్ని అంశాలుంటాయి. సినిమాలో అశోక్ సెల్వన్, రీతూవర్మ, నిత్యామీనన్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5 ఉదయం 11 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’అన్నారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.
నటీనటులు:
అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ తదితరులు
సాంకేతిక వర్గం :
దర్శకత్వం : అని.ఐవీ శశి
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
సమర్పణ : బాపినీడు బీ
సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి
సంగీతం : రాజేశ్ మురుగేశన్
పాటలు : శ్రీమణి
డైలాగ్స్ : నాగ చంద, అనూష, జయంత్ పానుగంటి
ఆర్ట్ : శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటింగ్ : నవీన్ నూలి