బహీ ఖాతాలో ఏం దాచారో ..?

న్యూఢిల్లీ : 2019లో తన తొలి బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా బడ్జెట్‌ను లెదర్‌ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు.

వ్యాక్సిన్‌ రాకతో దేశవ్యాప్తంగా ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. భారత్‌ ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచింది. ఈనేపథ్యంలో కరోనాతో ఏర్పడిన దుష్ప్రభావాలను నిర్మూలించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమర్ధవంతమైన ‘వాక్సిన్‌’ను ప్రకటిస్తారని పలు రంగాలు ఎదురు చూస్తున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్‌లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది.