మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదు

సిద్దిపేట జిల్లా : తెలంగాణ రైతులు వర్షం కోసం మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. మంగళవారం కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను మంత్రి విడుదల చేశారు. కూడవెల్లి వాగుకు కొత్త దశ , దిశా చూపి పునర్జన్మ ను ప్రసాదించిన ఘనత సీఎం కేసీఆర్​దే తని మంత్రి హరీశ్​రావు కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో గుక్కెడు మంచి నీళ్ల కోసం తల్లడిల్లింది ఈ ప్రాంతం. ప్రస్తుతం మండు టెండల్లో జలకళ ను సంతరించు కుందని ఆనందం వ్యక్తం చేశారు.

ads

100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మ ను తీసుకువచ్చి కూడవెల్లి వాగు కు జలకళ తెచ్చామన్నారు. కూడవెల్లి వాగు లోకి గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువార్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని మంత్రి చెప్పారు. గోదావరి జలాల విడుదలతో వెయ్యి వోల్ట్ ల బల్బు వేస్తే వచ్చే వెలుగు రైతుల కళ్లలో కనబడుతుందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు ప్రస్తుత ఫలితాలు చూసి ఈర్ష్య పడుతున్నారని విమర్శించారు. గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో లక్షల రూపాయల విలువైన పంటను కాపాడు కోగలిగామని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. స్వరాష్ట్రం సాధించుకున్నందువల్లే సాగు, తాగు నీటి బాధలకు శాశ్వత పరిష్కారం చూపగలిగామమని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల విమర్శలకు తమ పని తీరుతోనే సమాధానం చెబుతున్నామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు.