ఇగ్నోలో ప్రవేశానికి నోటిఫికేషన్

హైదరాబాద్ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ( ఇగ్నో ) లో 2021-2022 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్‎లైన్‎లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత అయిన వారితో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు.

ads

కోర్సులు- అర్హతలు
*బీఏ /బీకాం : మ్యాథ్స్ , ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ పొలిటికల్ సైన్స్ , సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , సోషియాలజీ, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం.

*అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణత

* బీఎల్ఐఎస్ – అర్హతలు : 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్‎లో ఏడాది డిప్లొమా లేదా డిగ్రీ తర్వాత ఏదైనా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సెంటర్‎లో రెండేండ్లు పనిచేసిన అనుభవం.

*బీఎస్సీ ( బోటనీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, జియాలజీ, మ్యాథ్స్ , ఫిజిక్స్ , జువాలజీ ) – అర్హతలు : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత

*బీఏ ( టూరిజం స్టడీస్) – అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణత

*పీజీ కోర్సులు -ఎంకాం, ఎంఏ ( పొలిటికల్ సైన్స్ , హిస్టరీ, సోషియాలజీ, సైకాలజీ ఎకనామిక్స్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) ఎంఎస్‎డబ్ల్యూ తదితరాలు

అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత . వీటితో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

*దరఖాస్తు : ఆన్‎లైన్‎లో

*చివరి తేదీ : మార్చి 15

*వెబ్‎సైట్ : https://ignouadmission.samarth.edu.in