హోమియోపతి సీట్ల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్: యాజమాన్య కోటాలో హోమియోపతి సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో జీహెచ్ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకిరించనున్నట్లు వెల్లడించింది.

నీట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తునకు అర్హులని వెల్లడించింది. సాంకేతిక సమస్యల కోసం 8466924522/ 9704093953 , నిబంధనల స్పష్టత కోసం 9490585796/ 8500646769 నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.